2.0లో అమీ జాక్సన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

2.0లో అమీ జాక్సన్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

చెన్నై: తమిళ సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం 2.0. తాజాగా అమీజాక్సన్ పై వచ్చే సన్నివేశాలను షూట్ చేయనుంది శంకర్ అండ్ టీం. ఇందుకోసం అమీజాక్సన్ సెట్స్ లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా అమీ జాక్సన్ పోస్టర్ ను ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ శంకర్ రిలీజ్ చేశారు.

 అక్షయ్‌కుమార్, అమీ జాక్సన్ ప్రధాన పాత్రల్లో వస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ను చిత్రయూనిట్ ఇదివరకే విడుదల చేసింది. ఆ పోస్టర్ లో సూపర్ స్టార్ రజినీకాంత్, అక్ష‌య్ కుమార్ ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్టులో అమీజాక్సన్ ఫీమేల్ లీడ్ పోషిస్తున్నది. అమీ జాక్సన్ పై తీసే సాంగ్ షూట్ ఇవాళ మొదలవుతున్నదంటూ శంకర్ ట్వీట్ చేశారు.