>

‘అ’ సినిమాలో నిత్యా మీన‌న్ లుక్ ఇదే

‘అ’ సినిమాలో నిత్యా మీన‌న్ లుక్ ఇదే

  న‌టుడిగా మంచి విజ‌యాలు సాధిస్తున్న నాని ఇటీవ‌ల వాల్ పోస్ట‌ర్ అనే ప్రొడ‌క్ష‌న్ సంస్థ స్థాపించి ఈ బేన‌ర్‌పై నిర్మాతగా తొలి సినిమా చేస్తున్నాడు. ప్రశాంత్ వర్మ ద‌ర్శ‌క‌త్వంలో 'అ' అనే టైటిల్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, శ్రీనివాస్ అవ‌స‌రాల‌, రెజీనా, ఈషా రెబ్బా, ప్రియ‌ద‌ర్శిని లీడ్ పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి నాని, ర‌వితేజ వాయిస్ ఇవ్వ‌డం విశేషం. వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో విడుద‌ల కానున్న ఈ చిత్రం 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవ‌లే నాని త‌న ట్విట్ట‌ర్ ద్వారా మూవీ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేశాడు. తాజాగా వాల్ పోస్ట‌ర్ నిర్మాణ సంస్థ త‌మ ట్విట్ట‌ర్‌లో నిత్యా మీన‌న్ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసి ఆడియ‌న్స్‌కి అదిరిపోయే ట్రీట్ అందించింది.