అబుదాబిలో ‘సాహో’

అబుదాబిలో ‘సాహో’

  ప్రభాస్‌ 'బాహుబలి' తర్వాత సూజిత్‌ దర్శకత్వంలో 'సాహో' చేస్తున్న విషయం తెలిసిందే. యువీ క్రియేషన్స్‌ బ్యానర్‌లో తెరకెక్కుతోంది. శ్రద్ధా కపూర్‌ కథానాయికగా చేస్తుంది. ఈ థ్రిల్లర్‌ చిత్రం ఇప్పుడు అబుదాబిలో చిత్రీకరణ జరుపుకుంటోంది. 250మంది ఆర్టిస్టులు ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. గత ఏడాది 'టైగర్‌ జిందా హై' తర్వాత అబుదాబిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న రెండో భారతీయ సినిమా 'సాహో' కావడం విశేషం. ' టైగర్‌ జిందా హై' చిత్రంలో పోరాట సన్నివేశాలు తీసేందుకు 20 రోజులు కేటాయిస్తే ప్రభాస్‌ సినిమాకు 50 రోజుల్లో పూర్తి చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

మిలియన్‌ ఇంపాజిబుల్‌ - గోస్ట్‌ ప్రొటోకాల్‌, పీయరల్‌ హరబోర్‌, ట్రాన్స్‌ఫార్మర్‌ : డార్క్‌ ఆఫ్‌ ది మూన్‌, ద ఫాస్ట్‌ అండ్‌ ప్యూరియజ్‌...వంటి హాలీవుడ్‌ చిత్రాలకు స్టంట్‌మ్యాన్‌గా చేసిన కెన్నీ బేట్స్‌ 'సాహో'కు కూడా పని చేస్తుండడం విశేషం. ఈ సందర్భంగా ప్రభాస్‌ అబుదాబిలో మీడియాతో మాట్లాడుతూ 'అబుదాబిలో చిత్రీకరణ జరుపుకోవడం చాలా ఎగ్జైటెడ్‌గా ఉంది. ఇక్కడ షూటింగ్‌ జరపడం విశేషమని చిత్ర పరిశ్రమలోని నా స్నేహితులు అన్నారు. ఇది ఓ మైలురాయిగా నిలుస్తుందని, సినిమా స్థాయిని పెంచుతుందని వాళ్లు చెప్పారు. ఇక్కడి అధికారులు, ప్రభుత్వం, ప్రజలు, అభిమానుల నుంచి మాకు అందుతున్న సహాయం నన్ను ఇంప్రెస్‌ చేసింది. సినిమా షూటింగ్‌ సజావుగా జరగడానికి వీరంతా సహకారం అందిస్తున్నారు' అని పేర్కొన్నారు.