అక్షయ్ కుమార్‌ సరసన నిత్యా మీనన్‌

అక్షయ్ కుమార్‌ సరసన నిత్యా మీనన్‌

 సమ్‌ థింగ్‌ స్పెషల్‌ అనిపిస్తే గానీ సినిమాకి అంత ఈజీగా సంతకం చేయనని నిత్యా మీనన్‌ అంటోంది. అందుకే నిత్యా మీనన్‌ సినిమా రిలీజవుతుందంటే కొద్దో గొప్పో డిఫెరెంట్‌ సినిమా అని ఎక్స్‌ పెక్ట్‌ చేస్తారు ఆడియెన్స్‌. అలా చేసే సినిమాల కౌంట్‌ తక్కువే అయినా, క్రేజ్‌ మీటర్‌ మాత్రం ఏ మాత్రం తగ్గకుండా చూసుకుంటుంది నిత్యా మీనన్‌. ఇప్పుడు అదే ప్లానింగ్‌తో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వనుంది నిత్య. ఫస్ట్‌ సినిమాలోనే అక్షరు కుమార్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోనుంది.

ప్రస్తుతం 2.0 సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్న అక్షరు కుమార్‌ ఈనెలాఖరు నుండి కొత్త సినిమా 'మిషన్‌ మంగళ్‌' సెట్స్‌ పైకి రానున్నాడు. భారీ గ్రాఫిక్స్‌తో స్పేస్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఇప్పటికే విద్యాబాలన్‌, సోనాక్షి సిన్హా, తాప్సీ ఫిక్సయ్యారు. ఈ ముగ్గురితోపాటు ఈ వరసలో నిత్యా మీనన్‌ కూడా చేరింది. అయితే ఈ సినిమాలో నిత్యా ప్లే చేసే క్యారెక్టర్‌ ఏంటనేది ఇంకా తెలియాల్సి ఉంది. భారీ బడ్జెట్‌తో ఫాక్స్‌ స్టార్‌ స్టూడియోస్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలిమ్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకి ఇద్దరు దర్శకులు పని చేయనున్నారు. 'ప్యాడ్‌ మ్యాన్‌' సినిమాతో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన ఆర్‌. బల్కితో పాటు జగన్‌ శక్తి ఈ సినిమాని తెరకెక్కించనున్నారు.