అమ్మాయిలూ... ఇది మీ కోసమే

అమ్మాయిలూ... ఇది మీ కోసమే

 నాని, దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా ఉండనుందన్న విషయం తెలిసిందే. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన ఆదివారం విడుదలైంది. ఇది నానికి 24వ చిత్రం. మైత్రీ మూవీ మేకర్స్‌ నిర్మించనుంది. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌, మోహన్‌ చెరుకూరి (సీవీఎం) నిర్మాతలు. ఫిబ్రవరి 19న ఈ చిత్రం రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలుకానుంది. ఈ సినిమా గురించి నాని ఆదివారం ట్విట్టర్‌లో ఆసక్తికరమైన పోస్ట్‌ చేశారు నాని. 'నేను, విక్రమ్‌ ఇంకా ఆ మిగతా ఐదుగురు. వచ్చే సంవత్సరంలో. అమ్మాయిలూ ఇది మీ కోసమే'అని పోస్ట్‌ చేశారు. ఈ సందర్భంగా నాని, విక్రమ్‌ కుమార్‌ గోడ మీడ కూర్చొన్న ఫొటోను షేర్‌ చేశాడు.

నిర్మాతలు మాట్లాడుతూ ' నాని హీరోగా, సక్సెస్‌ఫుల్‌ డైరెక్టర్‌ విక్రమ్‌ కె కుమార్‌ దర్శకత్వంలో మా సంస్థలో సినిమాను నిర్మిస్తున్నందుకు ఆనందంగా ఉంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. విజువల్స్‌తో వండర్లు చేసే పీసీ శ్రీరామ్‌ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటులను, సాంకేతిక నిపుణుల పేర్లను వెల్లడిస్తాం' అని చెప్పారు. ప్రస్తుతం నాని 'జెర్సీ' సినిమా చిత్రీకరణలో ఉన్నారు. క్రీడా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రద్ధ శ్రీనాథ్‌, రెబా మోనికా జాన్‌ కథానాయికలుగా నటిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.