అనుష్కతో మరో ఇద్దరు హీరోయిన్లు..

అనుష్కతో మరో ఇద్దరు హీరోయిన్లు..

 భాగమతి చిత్రం తర్వాత టాలీవుడ్ హీరోయిన్ అనుష్క హేమంత్ మధుకర్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. సైలెన్స్ టైటిల్ తో థ్రిల్లర్ మూవీగా వస్తున్న ఈ సినిమాలో మాధవన్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో అనుష్కతోపాటు మరో ఇద్దరు హీరోయిన్లు కూడా సందడి చేయనున్నారు. అంజలి, షాలిని పాండే కీలక పాత్రల్లో నటించనున్నట్లు టాక్. కోన ఫిలిం కార్పొరేషన్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీత దర్శకుడు. మార్చి నుంచి సినిమా సెట్స్ పైకి వెళ్లనున్నట్లు సమాచారం.