అర్జున్ రెడ్డి రీమేక్ లో శ్రియా..?

అర్జున్ రెడ్డి రీమేక్ లో శ్రియా..?

 హైదరాబాద్ : విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి బాక్సాపీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ సినిమాను తమిళ్ లో తెరకెక్కించే సన్నాహాలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డైరెక్టర్ బాల అర్జున్ రెడ్డి రీమేక్ కు దర్శకత్వం వహించనున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్టు కు సంబంధించి మరో న్యూస్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నది. ఈ చిత్రంలో నిర్మలా కాన్వెంట్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రియా శర్మను హీరోయిన్ గా ఎంపిక చేయాలని భావిస్తున్నాడట డైరెక్టర్ బాల. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ విక్రమ్ కుమారుడు ధ్రువ్ నటిస్తున్నట్లు సమాచారం.