అర్జున్ రెడ్డిలో ఊర్వశి ఊర్వ‌శి సాంగ్‌

అర్జున్ రెడ్డిలో ఊర్వశి ఊర్వ‌శి సాంగ్‌

  ప్రభుదేవా, నగ్మా జంటగా నటించిన ‘ప్రేమికుడు’ చిత్రంలోని ఊర్వశి ఊర్వ‌శి అనే పాట 90ల‌లో కుర్ర‌కారుని ఎంతగా ఊపేసిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఏఆర్ రెహ‌మాన్ స్వ‌ర‌ప‌ర‌చిన క్లాసిక్ సాంగ్ ఇప్ప‌టి సంగీత ప్రియుల మ‌దిలోను మెదులుతుంది. ఇప్పుడు ఈ పాట‌ని హిందీ అర్జున్ రెడ్డిలో పెట్టాల‌ని మేక‌ర్స్ భావిస్తున్నార‌ట‌. తెలుగు అర్జున్ రెడ్డి తెర‌కెక్కించిన సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో హిందీ అర్జున్ రెడ్డి రూపొంద‌నుండ‌గా, ఈ స్పెష‌ల్ సాంగ్ కోసం ‘భరత్ అనే నేను’ భామ కియారా అడ్వాణీని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. 

ఈ రీమేక్‌ పాటను ప్రముఖ గాయకుడు యోయో హనీ సింగ్‌ కంపోజ్‌ చేయనున్నారట. ‘ఈ పాట కోసం లిరిక్స్‌ మార్చాం. కానీ ‘ఊర్వశీ..’ అంటూ వచ్చే లిరిక్స్‌ను మాత్రం అలాగే ఉంచాం. ఈ పాటను షాహిద్‌, కియారాతో చిత్రీకరిస్తున్నాం. ఫిలిం సిటీలోని క్లబ్‌ సెట్‌లో దీనిని చిత్రీకరిస్తున్నాం.’ అని కొరియోగ్రాఫర్‌ సంజయ్‌ శెట్టి తెలిపారు. ప్రభుదేవాకి వీరాభిమాని అయిన కియారా ఆయ‌న వేసిన స్టెప్పుల‌కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా చేస్తాన‌ని అంటుంది. కియారా ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌లో బోయ‌పాటి శీను తెర‌కెక్కిస్తున్న మూవీలో క‌థానాయిక‌గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.