>

భాగ్యనగరిలో ఆటపాట

భాగ్యనగరిలో ఆటపాట

 నేను శైలజ తర్వాత హీరో రామ్, దర్శకుడు కిషోర్ తిరుమల కలయికలో మరో సినిమా రూపొందుతున్నది. స్రవంతి మూవీస్, పి.ఆర్ సినిమాస్ పతాకాలపై స్రవంతి రవికిషోర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, మేఘా ఆకాష్ కథానాయికలు. ఈ చిత్ర మూడో షెడ్యూల్ ఇటీవల హైదరాబాద్‌లో పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ కుటుంబ బంధాలకు ప్రాధాన్యమున్న ప్రేమకథా చిత్రమిది. ఈ నెల 14న హైదరాబాద్‌లో పూర్తయిన మూడో షెడ్యూల్‌లో ఐదురోజుల పాటు ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని చిత్రీకరించాం. తదుపరి షెడ్యూల్‌ను ఈ నెలాఖరు నుంచి వైజాగ్, అరకులలో చిత్రీకరించనున్నాం అని తెలిపారు. 


నేను శైలజ విజయం తర్వాత రామ్‌తో నేను చేస్తున్న ఈ చిత్రంపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. వాటికి తగినట్లుగా విభిన్నమైన కథ, కథనాలతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాం. రామ్ లుక్‌కు చక్కటి స్పందన లభిస్తున్నది. దేవీశ్రీప్రసాద్ సంగీతం, కథానాయికల పాత్రలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. తెలుగు ప్రేక్షకులకు నవ్యమైన అనుభూతిని పంచే చిత్రమిది అని దర్శకుడు కిశోర్ తిరుమల చెప్పారు. శ్రీవిష్ణు, పెళ్లిచూపులు ప్రియదర్శి, ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆర్ట్: ఏ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, సినిమాటోగ్రఫీ: సమీర్‌రెడ్డి.


Loading...