>

భ‌య‌పెట్టిస్తున్న అనుష్క‌.!

భ‌య‌పెట్టిస్తున్న అనుష్క‌.!

 విరాట్ కోహ్లి ప్రేయ‌సి, బాలీవుడ్ భామ అనుష్క శ‌ర్మ డీ గ్లామ‌ర‌స్ పిక్ అభిమానుల‌ని షాక్ కి గురి చేస్తుంది. లేలేత పువ్వులా ఉండే అనుష్క అందం ఆ పిక్ లో మ‌టుమాయ‌మైన‌ట్టు క‌నిపిస్తుంది. పూర్తి డీ గ్లామ‌ర్ లుక్ లో భ‌య‌పెడుతున్న అనుష్కని చూసి ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే ఇది పారి పేరుతో తెర‌కెక్కుతున్న చిత్రంలోని ఫ‌స్ట్ లుక్ కాగా, తాజాగా మేక‌ర్స్ విడుదల చేశారు. డెబ్యూ డైరెక్ట‌ర్ ప్రోసిత్ రాయ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తుండ‌గా ముంబై, కోల్ కతా లలో షూటింగ్ ను ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి తాను స్వయంగా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తోండ‌గా, ఇందులో అనుష్క ఛాలెంజింగ్ రోల్ చేయ‌నుంద‌ని తెలుస్తుంది. మ‌రి ఈ సినిమా అనుష్క కి ఎంత‌టి పేరు తీసుకొస్తుందో చూడాలి.


Loading...