భరతనాట్యం నేపథ్యంలో....

భరతనాట్యం నేపథ్యంలో....

 శ్రీ మంగం, శశాంక్, అవంతిక హరి నల్వా, గాయత్రి అయ్యర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ప్రణవం. తను ఎస్ నిర్మిస్తున్నారు. కుమార్.జి దర్శకుడు. చిత్రీకరణ పూర్తయింది దర్శకుడు మాట్లాడుతూ భరతనాట్యం ఇతివృత్తంతో సంగీత ప్రధానంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. ప్రేమ, సస్పెన్స్ అంశాల సమాహారంగా సాగుతుంది. శ్రీ పాత్ర నవ్యరీతిలో ఉంటుంది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్ని జరుపుతున్నాం. ఆర్.పి. పట్నాయక్, ఉష ఆలపించిన పాట సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. త్వరలో చిత్ర గీతాలను విడుదల చేస్తున్నాం. అన్ని వర్గాల వారిని ఈ సినిమా అలరిస్తుంది అని తెలిపారు. జెమిని సురేష్, నవీన్, బాబి, దొరబాబు, సమీర ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: మార్గల్ డేవిడ్, సంగీతం: పద్మనాభ్ భరద్వాజ్.