బాలీవుడ్ దర్శకుడితో తమన్నా తెలుగు మూవీ

బాలీవుడ్ దర్శకుడితో తమన్నా తెలుగు మూవీ

 ఈ మధ్య కాలంలో తమన్నా చేతిలో పెద్దగా తెలుగు సినిమాలు లేకుండా పోయాయనే చెప్పాలి. ఇటీవలే ఒక్కొక్కటిగా మళ్లీ అవకాశాలు పలకరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆమె ఒక తెలుగు సినిమా చేస్తోంది .. అదీ సందీప్ కిషన్ జోడీగా. హిందీలో 'ఫనా' .. 'హమ్ తుమ్' వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన కునాల్ కోహ్లీ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తుండటం విశేషం.ఈ సినిమాకి 'నెక్స్ట్ ఏంటి' అనే టైటిల్ ను ఖరారు చేశారు. కథా పరంగా ఈ సినిమా షూటింగు 'లండన్'లో ఎక్కువగా జరిగింది. రైనా జోషి - అక్షయ్ పూరి నిర్మిస్తోన్న ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నవదీప్ .. పూనమ్ కౌర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా నుంచి టీజర్ ను వదలనున్నారు. డిసెంబర్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.