బాలీవుడ్‌లో పూజాకు మరో ఛాన్స్‌

బాలీవుడ్‌లో పూజాకు మరో ఛాన్స్‌

 పూజా హెగ్డేకు ఇటు తెలుగులోనూ, అటు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అదీ అగ్రనటుల సరసన నటించే ఛాన్స్‌ వస్తుంది. మొదటిసారి ఇక్కడ అల్లు అర్జున్‌తో నటించింది. తర్వాత 'రంగస్థలం' చిత్రంలో ప్రత్యేక గీతంలో మెప్పించింది. ఎన్టీఆర్‌తో చేసిన 'అరవింద సమేత వీర రాఘవ' మిక్సిడ్‌ రివ్యూలు లభించాయి. ఇప్పుడు తెలుగులో ఒక పక్క మహేశ్‌ బాబు చిత్రం 'మహర్షి'లోనూ, ప్రభాస్‌తో మరో సినిమాలోనూ చేస్తోంది. ఇది కాకుండా బాలీవుడ్‌లో అక్షరు కుమార్‌తో కలసి 'హౌస్‌ఫుల్‌ 4'లో కథానాయిక ఈమె. రోహిత్‌ శెట్టి దర్శకత్వంలో తాజాగా కొత్త చిత్రం సెట్స్‌పైకి వెళ్లబోతుంది. అందులోనూ అక్షరు కుమారే కథానాయకుడు. ఈ చిత్రంలోనూ హెగ్డేనే కథానాయిక తీసుకునే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టు తెలిసింది. ఈ చిత్రంలో నటించే ఛాన్స్‌ వస్తే బాలీవుడ్‌లో పూజాకు అవకాశాలు పెరిగినట్టే.