>

సీఎం కోసం శాతకర్ణి స్పెషల్ షో..!

సీఎం కోసం శాతకర్ణి స్పెషల్ షో..!

బాలయ్య వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. తమ అభిమాన నటుడి సినిమా చూడాలని రాత్రి నుండే అభిమానులు థియేటర్ దగ్గర పడిగాపులు కాస్తున్నారు. డప్పులతో, పాలాభిషేకాలతో ఫ్యాన్స్ థియేటర్స్ దగ్గర హంగామా చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 5.15ని.లకే బెనిఫిట్ షో ప్రదర్శితం కాగా మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో సినీ లవర్స్ థియేటర్స్ దగ్గర బారులు తీరారు. ఇక గౌతమి పుత్ర శాతకర్ణి చారిత్రాత్మక చిత్రం కావడంతో ఈ సినిమాను చూడాలని కేసీఆర్ భావించారు. ఈ నేపథ్యంలో ఉదయం 11గం.లకు ఐమాక్స్ థియేటర్ లో బాలయ్య, క్రిష్ లతో కలిసి చిత్రాన్ని చూడనున్నారు. కేసీఆర్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ షోకి హాజరు కానున్నట్టు సమాచారం.


Loading...