కమెడియన్‌గా సునీల్ రీఎంట్రీ..

కమెడియన్‌గా సునీల్ రీఎంట్రీ..

  హైదరాబాద్ : ఎన్నో హిట్ చిత్రాల్లో కమెడియన్‌గా ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి, ఆ తర్వాత హీరోగా మారాడు సునీల్. ఈ యాక్టర్ అందాలరాముడు, మర్యాదరామన్న, ఉంగరాల రాంబాబు, భీమవరం బుల్లోడు, టు కంట్రీస్‌తోపాటు మరెన్నో చిత్రాల్లో నటించాడు. సునీల్ చాలా గ్యాప్ తర్వాత కమెడియన్‌గా మళ్లీ సిల్వర్‌స్క్రీన్‌పై కనిపించేందుకు రెడీ అయ్యాడు. శ్రీనువైట్ల డైరెక్షన్‌లో రవితేజ హీరోగా అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సునీల్ ఫుల్‌లెంగ్త్ కామెడీ రోల్‌లో కనిపించనున్నట్లు డైరెక్టర్ శ్రీనువైట్ల తెలిపాడు. మరోసారి ప్రేక్షకులను నవ్వించేందుకు వస్తున్న సునీల్‌కు మనం ఆల్ ది బెస్ట్ చెబుదాం. ఈ సినిమాలో అనూ ఇమ్మాన్యుయేల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎస్‌ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నాడు.