‘డియర్‌ కామ్రేడ్‌’ షూటింగ్‌ ప్రారంభం

‘డియర్‌ కామ్రేడ్‌’ షూటింగ్‌ ప్రారంభం

 విజ‌య్‌ దేవరకొండ కొత్త సినిమా 'డియర్‌ కామ్రేడ్‌' రెగ్యులర్‌ షూటింగ్‌ సోమవారం నుంచి మొదలైంది. ఈస్ట్‌ గోదావరి జిల్లా తొండంగిలో చిత్రీకరణ ప్రారంభమైంది. భరత్‌ కమ్మ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో విజ‌య్‌ సరసన కన్నడ నటి రష్మిక మండన్నా కథానాయికగా నటిస్తోంది. 'ఫైట్‌ ఫర్‌ వాట్‌ యు లవ్‌' అనే ట్యాగ్‌లైన్‌తో రూపొందుతున్న ఈ ఎమోషనల్‌ డ్రామాలో విజ‌య్‌ దేవరకొండ ఆంధ్రా అబ్బాయిగా కనిపించనున్నాడు. ఆంధ్రా స్లాంగ్‌లో విజరు చెప్పే డైలాగులు విశేషంగా ఆకట్టుకోనున్నాయని దర్శకుడు తెలిపాడు. సామాజిక బాధ్యత ఉన్న పాత్రను విజరు ఈ చిత్రంలో పోషిస్తున్నాడు. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం సమకూర్చనున్న ఈ చిత్రానికి సుజిత్‌ సారంగ్‌ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, బిగ్‌ బెన్‌ సినిమాస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిర్మాతలు : నవీన్‌ యెర్నేని, రవి శంకర్‌ యలమంచిలి, మోహన్‌ చెరుకూరి, యష్‌ రంగినేని.