డూప్ లేకుండా ఫైట్స్

డూప్ లేకుండా ఫైట్స్

  హారర్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రమిది. ఇందులో డూప్ లేకుండా పోరాట ఘట్టాల్లో నటించాను అని తెలిపింది రష్మి. ఆమె కథానాయికగా నటిస్తున్న చిత్రం అంతకుమించి. జానీ దర్శకుడు. సతీష్, ఎ. పద్మనాభరెడ్డి నిర్మాతలు. జై కథానాయకుడు. ఈ నెల 24న ఈ చిత్రం విడుదలకానుంది. శనివారం హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర విడుదల తేదీని దర్శకుడు అజయ్‌భూపతి వెల్లడించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మిగతా జోనర్స్‌తో పోలిస్తే హారర్ థ్రిల్లర్ సినిమాలు చేయడం కష్టం. మంచి సౌండ్ ఎఫెక్ట్స్‌తో ప్రచార చిత్రాలన్నీ బాగున్నాయి అని తెలిపారు. రష్మి పాత్ర ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని దర్శకుడు చెప్పారు. ఓ ప్రేమజంటకు ఎదురైన అనూహ్య పరిణామాలతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమా సాగుతుంది. పతాక ఘట్టాలు ప్రేక్షకుల్ని భయపెడుతాయి అని హీరో జై అన్నారు. అజయ్‌ఘోష్, మధునందన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పి. బాలిరెడ్డి, సంగీతం: సునీల్ కశ్యప్.