ఎనిమిదేళ్ల తర్వాత నాలుగో సినిమా.....

ఎనిమిదేళ్ల తర్వాత నాలుగో సినిమా.....

 మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఇరువర్ సినిమాతో కథానాయికగా అరంగేట్రం చేసింది ఐశ్వర్యరాయ్. ఆ తర్వాత వీరిద్దరి కలయికలో గురు, రావన్ సినిమాలు రూపొందాయి. తాజాగా మణిరత్నం, ఐశ్వర్యరాయ్ కలయికలో నాలుగో సినిమా రాబోతున్నట్లు తెలిసింది. కల్కి కృష్ణమూర్తి రచించిన తమిళ చారిత్రక నవల పొన్నియన్ సెల్వం ఆధారంగా ఓ భారీ మల్టీస్టారర్ సినిమాను తెరకెక్కించేందుకు మణిరత్నం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో కథానాయికగా ఐశ్వర్యరాయ్ బచ్చన్ నటించనున్నదని తెలిసింది. ఇటీవలే మణిరత్నం ఆమెతో సంప్రదింపులు జరిపారని, అభినయానికి ప్రాధాన్యమున్న విలక్షణ పాత్ర కావడంతో ఐశ్వర్యరాయ్ ఈ సినిమాలో నటించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రోబో తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల విరామం అనంతరం ఈ సినిమాతో తమిళ చిత్రసీమలోకి పునరాగమనం చేయనున్నది ఐశ్వర్యరాయ్. ఈ చిత్రంలో విక్రమ్ ఓ హీరోగానటించనున్నారు. ఆయనతో పాటు విజయ్‌సేతుపతి, శింబు ప్రధాన పాత్రలను పోషించనున్నట్లు తెలిసింది. మరో కీలక పాత్రలో అమితాబ్‌బచ్చన్‌ను తీసుకునే యోచనలో మణిరత్నం ఉన్నట్లు సమాచారం.