ఎవ‌రు ఊహించ‌ని క్రేజీ కాంబినేష‌న్ ..!

ఎవ‌రు ఊహించ‌ని క్రేజీ కాంబినేష‌న్ ..!

  ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో మ‌ల్టీస్టార‌ర్‌ల క్రేజ్ విప‌రీతంగా ఉంది. చిన్న హీరోల‌తో పాటు బ‌డా హీరోలు కూడా మ‌ల్టీ స్టార‌ర్ చిత్రంలో నటించేందుకు ఆస‌క్తి చూపుతున్నారు. ఇప్ప‌టికే రాజ‌మౌళి చేయ‌నున్న మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం టాలీవుడ్‌లో వైబ్రేష‌న్స్ క్రియేట్ చేస్తుండ‌గా, ఇప్పుడు స‌రికొత్త కాంబినేష‌న్‌లో ఓ మ‌ల్టీ స్టార‌ర్ ప్రాజెక్ట్ తెర‌కెక్క‌నుంద‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శీను టాలీవుడ్ స్టార్ హీరోలు బాల‌కృష్ణ‌- మ‌హేష్ బాబు కాంబోలో మ‌ల్టీస్టార‌ర్‌కి రంగం సిద్ధం చేసాడ‌ని తెలుస్తుంది. 

ఇప్ప‌టికే వారిద్ద‌రిని క‌లిసి క‌థ కూడా వినిపించాడ‌ట‌. దీనికి వారిరివురు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన‌ప్ప‌టికి , పూర్తి స్క్రిప్ట్ పూర్తైన త‌ర్వాత మ‌రోసారి డిస్క‌స్ చేద్దామ‌ని ఆ హీరోలు అన్న‌ట్టు తెలుస్తుంది. ప్ర‌స్తుతం బోయ‌పాటి ఈ క‌థ‌పైనే క‌స‌ర‌త్తులు చేస్తున్నాడ‌ని ఇన్‌సైడ్ టాక్‌. త్వ‌ర‌లో రామ్‌చ‌ర‌ణ్‌తో ప్రాజెక్ట్ చేయ‌నున్న బోయ‌పాటి ఈ మూవీ పూర్తైన త‌ర్వాత మ‌ల్టీస్టారర్ చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకెళ‌తాడ‌ని విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం. మ‌హేష్ ఇప్ప‌టికే వెంకీతో క‌లిసి సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు అనే మల్టీస్టార‌ర్‌లో న‌టించిన సంగ‌తి తెలిసిందే.