ఫిబ్రవరి 22న ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’

ఫిబ్రవరి 22న ‘ప్రేమకథా చిత్రమ్‌ 2’

 హారర్‌ చిత్రంగా రూపొందిన 'ప్రేమకథా చిత్రమ్‌' మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా 'ప్రేమకథా చిత్రమ్‌ 2' రాబోతుంది. ఆర్‌.పి.ఏ క్రియేషన్స్‌ బ్యానర్‌లో హరి కిషన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. సుమంత్‌ అశ్విన్‌, సిద్ధి ఇద్నాని జంటగా నటిస్తున్నారు. శాటిలైట్‌, హిందీ డబ్బింగ్‌ రైట్స్‌ ద్వారా కోటి 43 లక్షలు దక్కించుకోవడం విశేషం. నందిత శ్వేత మెయిన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. సూపర్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మొదటి పార్ట్‌కి ధీటుగా వస్తున్న ఈ చిత్రానికి నందిత శ్వేతా నటన మరో ప్లస్‌ అవుతుందని దర్శకుడు భావిస్తున్నాడు. ఆర్‌. సుదర్శన్‌ రెడ్డి నిర్మాత. ఈ చిత్రం రావు రమేష్‌ వాయిస్‌ ఓవర్‌తో నడుస్తుంది. చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫిబ్రవరి 22న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.