హైదరాబాద్‌లో  నాగ చైతన్య, సమంత చిత్రం షూటింగ్‌

హైదరాబాద్‌లో  నాగ చైతన్య, సమంత చిత్రం షూటింగ్‌

 నాగ చైతన్య, సమంత మొదటి వివాహ వార్షికోత్సవాన్ని విదేశాల్లో నిర్వహించుకున్నారు. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న చిత్రం నాలుగో చిత్రం బుధవారం సెట్స్‌ పైకి వెళ్లింది. రొమాంటిక్‌ ఎంటర్‌ట్రైనర్‌గా రూపొదుతోంది. హైదరాబాద్‌లో రెగ్యులర్‌ షూటింగ్‌ నిన్నటి నుంచి ప్రారంభించారు. 'నిన్ను కోరి' ఫేమ్‌ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. సినిమా ప్రపంచం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇది నాగ చైతన్య 17వ సినిమాగా తెరకెక్కుతోంది. దివ్యాన్ష కౌశిక్‌ మరో హీరోయిన్‌గా నటిస్తోంది. రావు రమేష్‌, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు ఇతర ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. గోపి సుందర్‌ సంగీతం సమకూరుస్తున్నారు. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌ పతాకం పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది ఈ సినిమాని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.