జెన్నిఫర్‌ లోపెజ్‌లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’

జెన్నిఫర్‌ లోపెజ్‌లో ‘అమర్‌ అక్బర్‌ ఆంటోనీ’

 రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్‌లో 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ' చిత్రం రూపొందుతోంది. అను ఇమ్మాన్యుయేల్‌ కథానాయిక. మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోంది. మార్చిలో శ్రీనువైట్ల కుమార్తెలు ఆనంది, ఆద్యలు క్లాప్‌ కొట్టి, కెమెరా స్విచ్చాన్‌ చేయగా షూటింగ్‌ ప్రారంభమైన విషయం తెలిసిందే. కామెడీ హీరో సునీల్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. లయ కుమార్తె శ్లోక, రవితేజ కుమారుడు మహాధన్‌ల స్పెషల్‌ రోల్స్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్రబృందం భావిస్తోంది. ఇటీవల అమెరికాలో షూటింగ్‌ మొదలయ్యింది. న్యూయార్క్‌, కాలిఫోర్నియా, డెట్రాయిట్‌, సాల్ట్‌ లేక్‌ సిటీ లాంటి ఎగ్జాటిక్‌ లొకేషన్స్‌లో చిత్రీకరించారు. ప్రస్తుతం ఒక లాంగ్‌ ఐల్యాండ్‌ లో జెన్నిఫర్‌ లోపెజ్‌కి చెందిన పలాటిటల్‌ హిడెన్‌ హిల్స్‌ మ్యాన్షన్‌ లో జరుగుతోంది. పాప్‌ దివా అయిన జెన్నిఫర్‌ లోపెజ్‌ కు వీరాభిమాని అయిన శ్రీనువైట్ల అక్కడ షూటింగ్‌ జరుపుకుంటున్న సందర్భంగా ట్విట్టర్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు. 'జెన్నిఫర్‌ లోపెజ్‌కి క్రేజీ ఫ్యాన్‌ని నేను. మిలియన్ల మందికి హార్ట్‌ త్రోబ్‌ అయిన ఎవర్‌ గ్రీన్‌ పాప్‌ క్వీన్‌ పలాటిటల్‌ మాన్షన్‌లో షూట్‌ చేయడం అనేది కల ఫలించడం లాంటిది. ఇది నా బిగ్గెస్ట్‌ ఫ్యాన్‌ మూమెంట్‌'' అని ట్వీట్‌ చేశారు.