జూలీ 2 సినిమాకు నో కట్స్..!

జూలీ 2 సినిమాకు నో కట్స్..!

 ఇటీవల సెన్సార్ బోర్డ్ ఎప్పుడు ఎలా స్పందిస్తుందో ఎవరికీ అర్థం కావటం లేదు. ఒక్కో సినిమా విషయంలో చాలా కఠినంగా వ్యవహిరంచే సెన్సార్ సభ్యులు కొన్ని సినిమాల విషయంలో మాత్రం చూసి చూడనట్టుగా వెళ్లిపోతున్నారు. పహ్లజ్ నిహ్లాని సెన్సార్ బోర్డ్ చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న తరువాత ఇక వివాదాలకు తెరపడినట్టే భావించారు.అయితే కొత్త చైర్మన్ ప్రసూన్ జోషి వస్తూ వస్తూనే ఎక్స్ జోన్ సినిమాపై నిషేదం విదించి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ప్రసూన్ కూడా అడల్ట్ సినిమాలను ఇబ్బంది పెడతారని భావించారు. కానీ అనూహ్యంగా బోల్డ్ కంటెంట్ తో తెరకెక్కిన జూలీ 2 సినిమాకు ఎలాంటి కట్స్ సూచించకుండా ఏ సర్టిఫికేట్ ఇచ్చి మరో షాక్ ఇచ్చారు ప్రసూన్. ట్రైలర్ లో అందాల ఆరబోతతో ఆదరగొట్టిన జూలీ, సినిమాలో కట్ చెప్పే స్థాయిలో విజువల్స్ లేవంటే ప్రేక్షకులు నమ్మలేకపోతున్నారు.