జూలై 28న నిహారిక వెడ్డింగ్‌

జూలై 28న నిహారిక వెడ్డింగ్‌

  సుమంత్ అశ్విన్, నిహారిక ప్ర‌ధాన పాత్ర‌ల‌లో డెబ్యూ డైరెక్ట‌ర్‌ ల‌క్ష్మ‌ణ్ క‌ర్య తెర‌కెక్కించిన‌ చిత్రం హ్యాపి వెడ్డింగ్‌. నిహారిక న‌టించిన తొలి చిత్రం ఒక మ‌న‌సు డివైడ్ టాక్ రావ‌డంతో ఇప్పుడు ఆమె రెండ‌వ సినిమాపై అభిమానుల‌లో చాలా అంచ‌నాలు ఉన్నాయి. హ్య‌పి వెడ్డింగ్ చిత్ర ట్రైల‌ర్ ఇటీవ‌ల‌ విడుద‌ల కాగా, ఇందులో పాల లాంటిది మా హ‌ర్ష‌.. కాఫీ చేసుకోవ‌చ్చు, కాంప్లైన్ చేసుకోవ‌చ్చు.. మ‌రి మా మ‌న‌వ‌డితో కాపురం చేసుకోవ‌చ్చా అండి అనే డైలాగ్ అభిమానులని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది. ఇక తాజాగా విడుద‌లైన ప్రోమో సాంగ్ కూడా అల‌రించింది. ఈ చిత్రం రొమాంటిక్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన‌ట్టు తెలుస్తుంది. పల్లెటూరు... ప్రేమ.. పెళ్లి హడావుడి కాన్సెప్ట్ తో తెర‌కెక్కిన ఈ చిత్రానికి శ‌క్తికాంత్ కార్తీక్ సంగీతం అందిస్తున్నాడు . థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ సంగీతం ఇస్తున్నాడు. యూవీ క్రియేష‌న్స్ మ‌రియు పాకెట్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాపై భారీ అంచ‌నాలే ఉన్నాయి. తాజాగా మూవీని జూలై 28న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఈ చిత్రం నిహారిక‌కి మంచి విజ‌యం అందించాల‌ని అభిమానులు కోరుతున్నారు.