కెఎస్‌100 ట్రైలర్‌ విడుదల

కెఎస్‌100 ట్రైలర్‌ విడుదల

  సమీర్‌ఖాన్‌, శైలజ, సునీత పాండే, ఆశి రారు, శ్రద్ధ, అక్షత ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న చిత్రం 'కె ఎస్‌ 100'. చంద్ర శేఖర్‌ మూవీస్‌ పతాకంపై కె.వెంకట్‌ రామ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. షేర్‌ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ట్రైలర్‌ను నిర్మాత సాయి వెంకట్‌, మల్టీ డీమెన్షన్‌ వాసు, అట్లూరి రామకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా వెంకట రామ్‌ రెడ్డి మాట్లాడుతూ 'హారర్‌ థ్రిల్లర్‌ రొమాంటిక్‌ మూవీ. సినిమా చాలా బాగొచ్చింది. అందరికీ నచ్చి తీరుతుందని ఆశిస్తున్నా' అని అన్నారు. 

హీరోయిన్‌ సునీత పాండే మాట్లాడుతూ ' ఇదివరకు భోజ్‌పూరి, పంజాబి సినిమాల్లో నటించాను. తెలుగులో ఇదే నా మొదటి సినిమా. సౌత్‌ ఇండిస్టీలో వర్క్‌ చేయాలని ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నా. ఇప్పటికి నెరవేరింది. నా పాత్ర చాలెంజింగ్‌గా ఉంటుంది. వందశాతం న్యాయం చేశానని అనుకుంటున్నాన'ని తెలిపారు. హీరోయిన్‌ శైలజ మాట్లాడుతూ 'మంచి స్టోరీతో తెలుగు ఇండిస్టీకు పరిచయం అవుతున్నా. గొప్ప అనుభూతిని పొందాను' అని చెప్పింది.