లేడీ గెట‌ప్‌లో స్టార్ హీరో...

లేడీ గెట‌ప్‌లో స్టార్ హీరో...

  కొన్ని పాత్ర‌లు చేయాలంటే చాలా గ‌ట్స్ ఉండాలి. ముఖ్యంగా నెగెటివ్ యాంగిల్‌లో ఉన్న పాత్రల‌ని చేసేందుకు స్టార్ హీరోలు రెడీ అవ్వ‌డం కాస్త డేరింగ్ అనే చెప్ప‌వ‌చ్చు. త‌మిళంలో విజ‌య్ సేతుప‌తికి చాలా క్రేజ్ ఉంది. తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా ఈ పేరు బాగా సుప‌రిచితం అయి ఉంటుంది. మెగాస్టార్ 151వ చిత్రం సైరాతో విజ‌య్ సేతుప‌తి టాలీవుడ్‌కి ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో బ్రిటీష్‌ వారి దగ్గర సిపాయిగా పనిచేసే భారతీయుడిగా విజయ్ కనిపిస్తాడని సమాచారం. ఇక ఇటీవ‌ల న‌వాబ్,96 అనే చిత్రంతోను తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. 


త‌మిళంలో ‘మక్కల్ సెల్వన్’గా పిల‌వ‌బ‌డే విజ‌య్ సేతుప‌తి ఇప్ప‌టి వ‌ర‌కు చాలా వెరైటీ ప్ర‌యోగాలు చేశాడు. తాజాగా సూప‌ర్ డీల‌క్స్ అనే మూవీ కోసం లేడీ గెట‌ప్ వేశాడు. చిత్ర ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లైంది. ఇందులో రెడ్ కలర్ శారీలో ద‌ర్శ‌న‌మిచ్చిన ఆయ‌న‌.. బొట్టుపెట్టుకుని సాంప్రదాయబద్ధంగా క‌నిపిస్తున్నాడు. చిత్రంలో ట్రాన్స్‌జెండ‌ర్‌గా విజ‌య్ సేతుప‌తి క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. ఈ పాత్ర పేరు శిల్ప కాగా, ఎక్కువ మేకప్ లేకుండా లేడీ గెటప్ లో ఈ మాస్ హీరో ఒదిగిపోయిన తీరు అందరినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తుంది. ట్రాన్స్‌జండర్‌గా మేకప్ వేసుకున్నప్పుడు మహిళల వస్త్రధారణలోని అందాన్ని చూడగలిగానని తెలిపారు విజ‌య్ సేతుప‌తి. ఆడవారిగా పుట్టడం వాళ్లు చేసుకున్న అదృష్టమని కొనియాడారు.

సూప‌ర్ డీల‌క్స్ చిత్రంలో విజయ్‌ సేతుపతితో పాటు ఫహద్‌ ఫాజిల్‌, సమంత, మిష్కిన్‌, రమ్యకృష్ణ, గాయత్రి, భగవతి పెరుమాల్‌ వంటి పెద్ద తారాగణం నటిస్తోంది. ఈ సినిమాకు కుమారరాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. నలన్‌ కుమారస్వామి, మిష్కిన్‌, నీలన్‌ శేఖర్‌లు కుమార‌రాజాతో క‌లిసి స్క్రీన్ ప్లే రాశారు. యువన్‌ శంకర్‌రాజా సంగీతం సమకూర్చుతున్నారు. బీఎస్‌ వినోద్‌, నీరవ్‌షాలు సినిమాటోగ్రాఫర్లుగా వ్యవహరిస్తున్నారు.