మనాలీకి తమిళంలో ఛాన్స్‌

మనాలీకి తమిళంలో ఛాన్స్‌

  స్వాతి, శ్రీ దివ్య, అంజలి, ఆనంది వీరంతా మన తెలుగు కథానాయికలు. కానీ ఇక్కడ కంటే తమిళంలో వీరికి అవకాశాలు ఎక్కువ. అక్కడ సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్లు. ఇప్పుడు వీరి జాబితాలో మనాలీ రాథోడ్‌ కూడా చేరిపోబోతుంది. తెలుగులో 'ఎం.ఎల్‌.ఎ', 'ప్యాషన్‌ డిజైనర్‌', 'హౌరా బ్రిడ్జి' లాంటి సినిమాల్లో నటించిన మనాలీకి తొలిసారిగా తమిళ సినిమాలో నటించే ఛాన్స్‌ వచ్చింది. ఆ చిత్రమే 'కాతెరి'. డీకే దర్శకత్వం వహిస్తున్నారు. జ్ఞానవేల్‌ రాజా నిర్మిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌ కుమార్‌, పూనమ్‌ బజ్వా, ఆత్మిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో మనాలీ మరో కీలక పాత్రలో కనిపించనుంది.