మెగా ఫ్యామిలీకి వార‌ణాసి సెంటిమెంట్‌..!

మెగా ఫ్యామిలీకి వార‌ణాసి సెంటిమెంట్‌..!

  సినిమా వాళ్ల‌కి సెంటిమెంట్స్ ఉండ‌డం స‌హ‌జమే. అయితే ఈ సెంటిమెంట్స్ ఇప్పుడు లొకేష‌న్స్‌కి కూడా ఉంటున్నాయ‌ని జోస్యాలు చెబుతున్నారు సినీ ప్రియులు. గ‌తంలో మెగాస్టార్ చిరంజీవి న‌టించిన‌ ఇంద్ర అనే సినిమాను కాశీలో తెర‌కెక్కించ‌గా , ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర భారీ విజ‌యాన్ని అందుకుది. ఆ త‌ర్వాత చిరు త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ నాయ‌క్ అనే సినిమా చేశాడు. కుంభమేళా నేపథ్యంగా ఇక్కడ ఇంటర్వెల్ ఫైట్ సీన్ తీశారు. ఈ సినిమా కూడా మంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ అందుకుంది. ఇక ప‌వ‌న్ కూడా జ‌యంత్ సి ప‌రాన్జీ ద‌ర్శ‌క‌త్వంలో తీన్ మార్ అనే చిత్రాన్ని కాశీ బ్యాక్‌డ్రాప్ లోనే చేశాడు. 

ఈ సినిమా అంత విజ‌యాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన అజ్ఞాత‌వాసి చిత్రం ఫైనల్ షెడ్యూల్ అంతా వార‌ణాసిలోనే తెర‌కెక్కింది. ఇప్పుడు ఈ మూవీ మంచి విజ‌యం సాధిస్తే విశ్వేశ్వ‌రుని ఆశీస్సులు మెగా ఫ్యామిలీకి ఉన్నాయ‌ని, వార‌ణాసి సెంటిమెంట్ మెగా ఫ్యామిలీకి వ‌ర్క‌వుట్ అవుతుంద‌ని ఓ అంచ‌నాకి రావ‌చ్చు. అజ్ఞాత‌వాసి చిత్రంలో ప‌వ‌న్ ఇంజ‌నీర్ స్టూడెంట్‌గా క‌నిపించ‌నుండ‌గా, ఆయ‌న స‌ర‌స‌న కీర్తి సురేష్‌, అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌లుగా నటించారు.