మైన‌స్ 8డిగ్రీల టెంప‌రేచ‌ర్‌లో షూటింగ్‌

మైన‌స్ 8డిగ్రీల టెంప‌రేచ‌ర్‌లో షూటింగ్‌

  సీనియ‌ర్ హీరో రాజ‌శేఖ‌ర్ ప్ర‌స్తుతం ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో క‌ల్కి అనే చిత్రం చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇది 1983 బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియడ్ చిత్రం కాగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ క‌థాంశంతో సినిమా తెర‌కెక్కుతుంది. చిత్రాన్ని శివానీ శివాత్మిక మూవీస్ బ్యాన‌ర్ స‌మ‌ర్పణ‌లో హ్యాపీ మూవీస్ ప‌తాకంపై రూపొందిస్తుండ‌గా.. సి.క‌ళ్యాణ్‌, శివానీ రాజ‌శేఖ‌ర్‌, శివాత్మిక రాజ‌శేఖ‌ర్ నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల ఈ చిత్ర షూటింగ్ రెండు కోట్ల రూపాయలతో హైదరాబాద్ లో వేసిన‌ భారీ సెట్ లో రూపొందింది. ఈ షెడ్యూల్‌లో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు చిత్రీక‌రించారు. ఆ స‌న్నివేశాల‌లో రాజశేఖర్ డూప్ లేకుండా రిస్క్ చేసి గాయ‌ప‌డ్డాడు. అయిన్ప‌ప‌టికి విశ్రాంతి తీసుకోకుండా త‌ర్వాతి షెడ్యూల్ కోసం త‌న టీంతో కులూం మ‌నాలి షెడ్యూల్‌కి వెళ్ళాడు రాజ‌శేఖ‌ర్. 


ప్ర‌స్తుతం ఈ చిత్ర షూటింగ్ హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో ఉన్న గులాబ అనే గ్రామంలో జ‌రుపుకుంటుంద‌ట‌. స‌ముద్ర మ‌ట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉండే ఈ ప్ర‌దేశంలో ప్ర‌స్తుత టెంప‌రేచ‌ర్ మైన‌స్ 8 డిగ్రీలు ఉంద‌ట‌. అలాంటి మ‌నోహ‌ర‌మైన ప్ర‌దేశంలో ద‌ర్శ‌కుడు రాజశేఖర్‌, అదా శర్మపై కీలక సన్నివేశాలను, ఓ పాటను తెర‌కెక్కించార‌ట‌. ఈ నెల 5 నుంచి హైదరాబాద్‌లో ఈ సినిమా తాజా షెడ్యూల్‌ మొదలు కానుంది. చిత్రంలో ముగ్గుకు క‌థానాయికలు ఉండ‌గా అందులో ఒక‌రు హార్ట్ ఎటాక్‌తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన అదా శ‌ర్మ కాగా, మ‌రొక‌రు బాహుబ‌లి-ది బిగినింగ్‌లో స్పెష‌ల్ సాంగ్‌లో అందాలు ఆర‌బోసిన స్కార్‌లెట్ విల్స‌న్, ఎక్క‌డ‌కి పోతావు చిన్న‌వాడ ఫేం నందిత శ్వేత అని తెలుస్తుంది.