మొదటిరోజు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కబాలి.

మొదటిరోజు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కబాలి.

మొదటిరోజు కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న కబాలి.

ప్రపంచ వ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేస్తూ రిలీజ్ అయిన మూవీ కబాలి. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలి చిత్రం ప్రస్తుతం థియోటర్స్ లో హల్ చల్ చేస్తుంది. ఇప్పటి వరకూ రజనీకాంత్ నటించిన ఏ మూవీకి రానంత క్రేజ్ ఈ కబాలి మూవీకి వచ్చింది. అలాగే రజనీకాంత్ ఏ మూవీకి క్రియేట్ చేయని ప్రి బిజినెస్ ఈ మూవీకి జరిగింది. బాలీవుడ్ లోనూ కమర్షియల్ సక్సెస్ అందుకునే టాప్ హీరోలకి సాధ్యం కానీ ప్రి బిజినెస్, కబాలి కి జరిగింది.
దాదాపు 4,500 స్క్రిన్స్ లో ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ మూవీకి జరిగిన బిజినెస్ ని చూస్తే అన్ని మూవీలు చిన్నబోయాయనే చెప్పాలి. ఇక మొదటి రోజే థియోటర్స్ ని హిట్ చేసిన కబాలి మూవీకి పాజిటివ్ టాక్స్ స్వాగతం పలికాయి. దీంతో అన్ని చోట్ల నుండి కబాలి మూవీకి పాజిటివ్ రిపోర్ట్స్ ఊపందుకున్నాయి.

ఇది మొదటి రోజు బాక్సాపీస్ ని మరింత ప్రభావితం చేయనుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అన్నీ థియోటర్స్ లో 100 శాతం ఆక్యుపెన్సీతో కబాలి మూవీ ప్రదర్శన జరుపుకోవటంతో ఈ మూవీ కలెక్షన్స్ కోట్ల రూపాయల్లో ఉండనున్నాయి. ఇప్పటికే ఈ మూవీ ఓవర్సీస్ లో ఒక మినిలియన్ మార్క్ ని దాటిందని ట్రేడ్ పండిట్స్ చెబుతున్నారు.
ఇక ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, కబాలి మూవీకి మొదటి రోజు కలెక్షన్స్ ప్రపంచ వ్యాప్తంగా 50 నుండి 60 కోట్ల రూపాయల లోపు ఉంటుందని అంటున్నారు. కేవలం రజనీకాంత్ క్రేజ్ తోనే ఇది సాధ్యం అనేది బాక్సాపీస్ రిపోర్ట్. తమిళంళో రియలిస్టిక్ సినిమాల దర్శకుడిగా పేరున్న పా రంజిత్ తెరకెక్కించిన ఈ సినిమాను కళైపులి థాను నిర్మించారు.