నా సినిమాకి బ్రేక్లు లేవు.

నా సినిమాకి బ్రేక్లు లేవు.

నా సినిమాకి బ్రేక్లు లేవు.
మెగాస్టార్ చిరంజీవి 150 వ మూవీ కత్తిలాంటోడు షూటింగ్ కు బ్రేక్ పడినట్టు వచ్చిన వార్తలు రూమర్లేనని తేలిపోయింది. ఈ చిత్రం షూటింగ్ నిలిచిపోలేదని, ఫుల్ స్వింగ్ లో ఉందని ఫోటోగ్రఫీ డైరెక్టర్ రత్నవేలు క్లారిటీ ఇచ్చారు. రెండో షెడ్యూల్ రెండు రోజుల క్రితమే స్టార్ట్ అయిందన్నారు. చిరు ఉత్సాహంగా షూటింగ్ లో పార్టి సిపేట్ చేస్తున్నారని, ఆయన ఎనర్జీ చెక్కు చెదర లేదని పేర్కొన్నారు. 
కత్తి లాంటోడు మూవీ స్క్రిప్ట్ లో కొన్ని అంశాలు నచ్చని కారణంగా కొన్ని సీన్స్..ముఖ్యంగా కమెడియన్ ఆలీ, తనతో కూడిన కొన్ని కామెడీ సన్నివేశాలు బాగా లేనందున రీ-షూట్ చేద్దామని చిరంజీవి సూచించినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కావడం ఖాయమని అన్నారు రత్నవేలు.