నాని సరసన టాప్ హీరోయిన్

నాని సరసన టాప్ హీరోయిన్

 నేచురల్ స్టార్ నాని తన సక్సెస్ జర్నీ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే డబుల్ హ్యట్రిక్ సాధించిన నాని ఇటీవల ఎంసీఏ అనే చిత్రంతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం కృష్ణార్జున యుద్ధం అనే చిత్రాన్ని చేస్తున్నాడు . ఇక నిర్మాతగా అ అనే సినిమాని నిర్మిస్తున్నాడు నాని. త్వరలో నాగ్‌తో ఓ మల్టీ స్టారర్ సినిమా చేయనుండగా, ఈ సినిమా వచ్చే నెలలో సెట్స్ పైకి వెళుతుందని తెలుస్తుంది. సి.అశ్వినీదత్ నిర్మాణంలో భలే మంచి రోజు , శమంతకమణి సినిమాల దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య నాగ్-నానిల మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ని తెరకెక్కించనున్నాడు. ఈ మూవీలో నాగార్జున డాన్‌గా కనిపిస్తాడని, నాని డాక్టర్ పాత్ర పోషిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఇక నాని సరసన టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ని కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. ఇటీవల స్పైడర్ చిత్రంతో పాటు ఖాకీ అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రకుల్ ప్రస్తుతం పలు తమిళ సినిమాలతో బిజీగా ఉంది.