ఒక్క క్లైమాక్స్ కోసం ౩౦ కోట్లు కర్చు.

ఒక్క క్లైమాక్స్ కోసం ౩౦ కోట్లు కర్చు.

ఒక్క క్లైమాక్స్ కోసం ౩౦ కోట్లు కర్చు.

‘బాహుబ‌లి’ చిత్రం ఆ స్థాయి విజ‌యం సాధించ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఆ సినిమా క్లైమాక్స్‌ను రాజ‌మౌళి తెర‌పై ఆవిష్క‌రించిన తీరు ఒక‌టి .. ఆ విజువ‌ల్ గ్రాండియారిటీ. యుద్ధ స‌న్నివేశాన్ని రంజింప‌జేసేలా తెర‌కెక్కించిన వైనం ప్రేక్ష‌కుల‌కు న‌చ్చి అంత పెద్ద హిట్టిచ్చారు.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ లో కీలకమైన క్లైమాక్స్ యుద్ధ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.బాహుబలి మొదటిభాగం లో దాదాపు గంట పాటు క్లయిమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు ప్రేక్షకుల్ని కట్టి పడేశాయి.దానికోసం దాదాపు 1000 మందిని ఉపయోగించారు.అదే బాహుబలి ది కంక్లూజన్ యుద్ధ సన్నివేశం కోసం ఏకంగా 5000 మందితో చిత్రీకరణ జరుపుతున్నారు జక్కన్న.
బాహుబలి ది బిగినింగ్ చిత్రానికి ఆయువు పట్టు క్లైమాక్స్ అని చెప్పవచ్చు. వెరైటీ స్టైల్‌లో దాదాపు ఓ 15 నిమిషాలు ప్రేక్షకుడిని సీట్‌కి అతుక్కుపోయేలా ఓ ఫైటింగ్ సీన్‌ని క్రియేట్ చేశాడు జక్కన్న. దీని కోసం 1000 మంది ఆర్టిస్టులను ఉపయోగించగా లక్షల కొద్ది సైన్యాన్ని గ్రాఫిక్ ద్వారా సృష్టించాడు. ఇప్పుడు సెకండ్ పార్ట్ క్లైమాక్స్ కోసం 5 వేల మంది ఆర్టిస్టులను ఉపయోగిస్తుండగా, ఈ షెడ్యూల్ కోసం దాదాపు వంద రోజులు కేటాయించాడట. అయితే ఈ క్లైమాక్స్ ఒక్క దానికే 30 కోట్ల బడ్జెట్‌ని కేటాయించడం విశేషం.
అందుకే ఇప్పుడు పార్ట్ -2లో క్లైమాక్స్‌ని అంతే ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కిస్తున్నారు రాజ‌మౌళి. కేవ‌లం ఈ ఒక్క క్లైమాక్స్ కోసం ఏకంగా రూ.30 కోట్లు ఖ‌ర్చు చేశార‌ని తెలుస్తోంది. ఆన్‌సెట్స్ ఎంతో ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుని ఈ వార్ సీన్స్‌ని తెర‌కెక్కించారు జ‌క్క‌న్న‌. బాహుబ‌లి క్లైమాక్స్‌ని మించి నాలుగింతలు విజువ‌ల్ గ్రాండియారిటీ ఈ క్లైమాక్స్‌లో ఉంటుంద‌ని చెబుతున్నారు.
ఇంకా ఈ తాజా షెడ్యూల్ లో ప్రభాస్,రానా,రమ్య కృష్ణ,తమన్నా,అనుష్క,సత్య రాజ్ తదితరులంతా పాల్గొంటున్నారు.మొత్తంగా 200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.2017 ఏప్రిల్ లో బాహుబలి ది కంక్లూజన్ విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు రాజమౌళి.