‘పడిపడి లేచే మనసు’ టీజర్‌

‘పడిపడి లేచే మనసు’ టీజర్‌

  శర్వానంద్‌, సాయిపల్లవి జంటగా నటిస్తున్న చిత్రం 'పడిపడి లేచే మనసు'. సినిమా టీజర్‌ను ఈనెల 10న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. కోల్‌ కత్తా, నేపాల్‌లోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షెడ్యూల్‌ జరుగుతుంది. చిత్రీకరణ చివరిదశలో ఉంది. ఈ చిత్రంలో మురళీ శర్మ, సునీల్‌, వెన్నెల కిషోర్‌ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి ఆదరణ లభించిందని, శర్వానంద్‌, సాయిపల్లవి నటన సినిమాకు హైలైట్‌ కానుందని నిర్మాత తెలిపారు. వీళ్ల కెమిస్ట్రీ ఫస్ట్‌ లుక్‌లోనే అద్భుతంగా ఉందని ప్రశంసలు దక్కాయని పేర్కొన్నారు. దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్‌ హైలైట్‌గా నిలుస్తుందని, విశాల్‌ చంద్రశేఖర్‌ ఈ రొమాంటిక్‌ ఎంటర్‌ టైనర్‌కు సంగీతం అందిస్తున్నారని చెప్పారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్‌ 21న సినిమా విడుదల కానుంది. ఈ చిత్రానికి నిర్మాత : సుధాకర్‌ చెరుకూరి.