ప‌వ‌న్‌, బ‌న్నీ ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ..!

ప‌వ‌న్‌, బ‌న్నీ ఆ త‌ర్వాత రామ్ చ‌ర‌ణ్ ..!

  ప్ర‌స్తుతం జ‌న‌రేష‌న్‌లో అభిమానుల‌ని ఎంత‌గానో అట్రాక్ట్ చేస్తున్న హీరోయిన్స్ లో అను ఎమ్మాన్యుయేల్ ఒక‌రు. నాని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన మ‌జ్ఞు చిత్రంతో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన అను అజ్ఞాత‌వాసి అనే చిత్రంలో సెకండ్ హీరోయిన్‌గా న‌టించింది. త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అజ్ఞాత‌వాసి చిత్రం ప‌వ‌న్ క‌ళ్యాణ్ 25వ చిత్రంగా రూపొందింది. ఇక అల్లు అర్జున్‌- వ‌క్కంతం వంశీ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న నా పేరు సూర్య అనే చిత్రంలోను అను ఎమ్మాన్యుయేల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. 

ఇక ఇప్పుడు మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్‌లోను అనూనే హీరోయిన్‌గా ఎంపిక చేసార‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం చ‌ర‌ణ్ రంగ‌స్థ‌లం 1985 ప్రాజెక్ట్‌తో బిజీగా ఉండ‌గా, ఆ త‌ర్వాత బోయ‌పాటితో ఓ మూవీ చేయ‌నున్నాడు. ఇందులో చెర్రీ స‌ర‌స‌న అనూ లాంటి యంగ్ భామ అయితేనే బాగుంటుంద‌ని యూనిట్ ఓ డెసిష‌న్‌కి వ‌చ్చింద‌ట‌. ఈ క్ర‌మంలోనే యంగ్ బ్యూటీని సెల‌క్ట్ చేశార‌ట‌. న‌వంబ‌ర్‌లో అఫీషియ‌ల్‌గా మొద‌లైన ఈ ప్రాజెక్ట్‌లో అను ఉంటుందా లేదా అనే మేట‌ర్‌కి సంబంధించి అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న ఎప్పుడు వ‌స్తుందో చూడాలి.