పెళ్లి కుదిరిన రోజు నుంచి...

పెళ్లి కుదిరిన రోజు నుంచి...

  సుమంత్‌ అశ్విన్‌, నిహారిక కొణిదెల జంటగా నటిస్తోన్న సినిమా 'హ్యాపీ వెడ్డింగ్‌'. యువీ క్రియేషన్స్‌, పాకెట్‌ సినిమా సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. లక్ష్మణ్‌ కార్య దర్శకత్వం. మ్యూజికల్‌ లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కూడిన ఈ చిత్రానికి తమన్‌ ప్రస్తుతం రీ-రికార్డింగ్‌ చేస్తున్నారు. ఇందులో తమన్‌ మార్క్‌ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరోవైపు 'ఫిదా'తో సంగీత ప్రియులకు మంచి మ్యూజికల్‌ ఫీస్ట్‌ అందించిన శక్తికాంత్‌ అద్భుతమైన పాటలు అందిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. 

నిర్మాతలు మాట్లాడుతూ ' ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్‌ పూర్తి చేసుకుని పోస్ట్‌ప్రొడక్షన్‌లో బిజీగా ఉంది. లక్ష్మణ్‌ కార్య మంచి విజన్‌ ఉన్న దర్శకుడు. పెళ్ళి కుదిరిన రోజు నుండి పెళ్ళి జరిగే రోజు వరకు రెండు కుటుంబాల మధ్య, రెండు మనసుల మధ్య ఏం జరుగుతుందనే విషయాన్ని చాలా అందంగా దర్శకుడు తెరకెక్కించాడు. ప్రతి ఒక్కరి జీవితంలో ఇలాంటి అనుభవం జరిగి ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడు తమని తాము చూసుకునేలా రూపొందిన చిత్రమిది' అని పేర్కొన్నారు.