‘పేట’ తొలిగీతం వచ్చేసింది

‘పేట’ తొలిగీతం వచ్చేసింది

  రజనీకాంత్‌ '2.0' తర్వాత ప్రేక్షకుల ముందుకు రానున్న ఆయన సినిమా 'పేట'. ఇటీవల ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. క్రిస్టమస్‌ సందర్భంగా ఇప్పుడు ఇందులో తొలిగీతాన్ని అభిమానుల ముందుకు తీసుకొచ్చారు. మరన మాస్‌..అనే పల్లవితో సాగే సాంగ్‌ ఇది. ఎస్పీ బాలసుబ్రమణ్యం, అనిరుధ్‌ రవిచంద్రన్‌ సంయుక్తంగా ఈ గీతాన్ని అలాపించారు. వివేక్‌ సాహిత్యం అందించారు. అనిరుధ్‌ స్వరాలు సమకూర్చాడు. ఈ గీతం ఆకట్టుకుంటోంది. ఈ గీతం తలైవాలా అభిమానులకు మాత్రం పెద్ద పడుగ లాంటిదే. ఆయన డైలాగులు చెప్పడంలో స్పెషల్‌. అవి ఈ గీతంలో పుష్కలంగా ఉన్నాయి. సాంగ్‌ మధ్యలో 'ఇక నుంచి ఈ కాళి ఆట చూస్తారు, కాళి చెడ్డవాడు' వంటి పంచుడైలాగ్‌లు వింటాం. ఈ చిత్రంలో రజనీకాంత్‌ పేరు కాళి. ఇది వరకూ ఈ పేరుతో డైరెక్టర్‌ ఐవీ శశి, రజనీకాంత్‌ కాంబినేషన్‌లో 'కాళి (1980)', ముల్లుమ్‌ మలారుమ్‌(1979) వచ్చి చిత్రాల్లో కూడా రజనీకాంత్‌ పాత్ర కాళినే. అదే పాత్రలో నటిస్తోన్న రజనీ చిత్రం 'పేట'పై భారీ అంచనాలే ఉన్నాయి.