పోలీస్‌ అధికారిణిగా అక్షరా గౌడ

పోలీస్‌ అధికారిణిగా అక్షరా గౌడ

 బోగన్‌ చిత్రం ఫేమ్‌ అక్షరాగౌడ గుర్తుందా? అంతకు ముందు తుపాకీ, చిత్రంలో కూడా గెస్ట్‌గా మెరిసింది. బెంగళూర్‌కు చెందిన ఈ బ్యూటీ అందాలను ఆరబోయటానికి ఏమాత్రం అభ్యంతరం చెప్పదని తన చిత్రాలు చూసిన వారికి అర్ధం అవుతుంది. అజిత్‌ హీరోగా నటించిన ఆరంభం చిత్రంలో ఈత దుస్తుల్లోనూ తడి తడి అందాలతో అలరించింది. మోడలింగ్‌ రంగం నుంచి వచ్చిన అక్షరాగౌడ హిందీ చిత్రాల్లోనూ నటించింది. ప్రస్తుతం మాతృభాషలో నటిస్తున్న అక్షరాగౌడ తమిళంలో ముఖ్య పాత్రలో నటించిన మాయవన్‌ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తోంది.


తాజాగా కోలీవుడ్‌లో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. వర్తమాన నటుడు ధృవరాజకు జంటగా నటించడానికి రెడీ అవుతోంది. పలు చిత్రాలకు ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరించిన పర్కో మెగా ఫోన్‌ పడుతున్న ఈ చిత్రానికి మీరినాల్‌ దండిక్కపడువీర్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది కుట్రం–23 చిత్రం తరహాలో క్రైమ్‌ థ్రిల్లర్‌ కథా చిత్రం అట. ఇందులో హీరో, హీరోయిన్లిద్దరూ అసిస్టెంట్‌ కమిషనర్లుగా నటించనున్నారు. చిత్రంలో హీరో ధృవరాజ్‌తో పాటు నటి అక్షరాగౌడకు కూడా భారీగానే యాక్షన్‌ సన్నివేశాలు చోటు చేసుకుంటాయట. ధరణ్‌ సంగీత భాణీలు కడుతున్న ఈ చిత్రానికి వెంకటేశ్‌ ఛాయాగ్రహణను అందించనున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ ఈ వారం చివర్లో ప్రారంభం కానుంది.