ప్రేమ కోసమే గురు

ప్రేమ కోసమే గురు

  రామ్‌, అనుపమ పరమేశ్వరన్‌ హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న సినిమా 'హలో గురు ప్రేమ కోసమే'. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మిస్తున్నాడు. లవ్‌ ఎంటర్‌ టైనర్‌గా తెరకెక్కుతోంది. సెన్సిబుల్‌, క్యూట్‌ ప్రేమ కథా చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో ప్రణీత మరో కథానాయికగా కీలక పాత్రలో నటిస్తోంది. త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమా టాకీ పార్ట్‌ పూర్తయ్యింది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్‌ 18న విడుదల చేయాలని నిర్మాత దిల్‌ రాజు సన్నాహాలు చేస్తున్నారు. విలక్షణ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఇందులో కీలకపాత్రలో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ బాణీలు సమకూరుస్తున్నారు. విజరు కె.చక్రవర్తి సినిమాటోగ్రఫీ, సాహి సురేశ్‌ ఆర్ట్‌ వర్క్‌, కార్తీక శ్రీనివాస్‌ ఎడిటింగ్‌ వర్క్‌ అందిస్తున్నారు. బెజవాడ ప్రసన్నకుమార్‌ మాటలు, రచన సహకారం సాయికృష్ణ అందిస్తున్నారు.