ప్రిన్స్‌ కొత్త అవతారం

ప్రిన్స్‌ కొత్త అవతారం

 మరో 'ప్రేమకథా చిత్రమ్‌' ప్రారంభం కాబోతోంది. ఇంటెన్సివ్‌ లవ్‌ స్టోరీగా రూపొందనున్న ఈ సినిమాలో 'బస్‌స్టాప్‌' ఫేమ్‌ ప్రిన్స్‌ హీరోగా నటిస్తున్నాడు. కొన్నాళ్లుగా మంచి కథల కోసం ఎదురు చూస్తున్న ఈ హీరోకు ఈ కథ నచ్చడంతో తెరకెక్కబోతోంది. దీని కోసం ప్రిన్స్‌ సరికొత్తగా అవతారంలో సిద్ధమయ్యాడు. మొత్తం తన లుక్‌నే మార్చేసుకున్నాడు. అలాగే ఫస్ట్‌ టైమ్‌ సిక్స్‌ ప్యాక్‌ కూడా ట్రై చేశాడు. ఈ కథకు అవసరమైనట్టుగా తనను తాను మార్చుకుని నటిస్తున్నాడు. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు చేస్తున్నారు. మరో కీలక పాత్రలో ఓ స్టార్‌ హీరోయిన్‌ కూడా నటించబోతోంది. ఆ హీరోయిన్‌ ఎవరనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఇక ఈ మూవీ లఢక్‌, గోవా, హైదరాబాద్‌, వారణాసి వంటి ప్రాంతాల్లో చిత్రీకరణ జరగబోతోంది. 'సూపర్‌ స్టార్‌ కిడ్నాప్‌' ఫేమ్‌ ఏ సుశాంత్‌ రెడ్డి నిర్మిస్తూ దర్శకత్వం వహిస్తున్నాడు. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి కెమెరా : సామల భాస్కర్‌, సంగీతం: హరి గౌర, సహ నిర్మాతలు : పొనుగుమాటి దిలీప్‌ కుమార్‌, నేతి పద్మాకర్‌, నిర్మాత, దర్శకత్వం : ఏ సుశాంత్‌ రెడ్డి.