రవితేజ ...డిస్కో రాజా

రవితేజ ...డిస్కో రాజా

  రవితేజ త్వరలో నటించనున్న చిత్రం 'డిస్కో రాజా'. ఈ నెల 12వ తేదీ నుంచి రెగ్యులర్‌ షూటింగ్‌ మొదలు కానుంది. పిరియాడికల్‌ ఎలిమెంట్స్‌ను జోడిస్తూ సైంటిఫిక్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కించబోతున్నారు. రామ్‌ తాళ్ల్లూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు విఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 'ఆర్‌ఎక్స్‌ 100' ఫేమ్‌ పాయల్‌ రాజ్‌పుత్‌, 'నన్నుదోచుకుందువటే' కథానాయిక నభా నటేశా హీరోయిన్లుగా చేస్తున్నారు. ఈ చిత్రం కాకుండా రవితేజ మరో రెండు సినిమాలు జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 'నేల టికెట్‌' తర్వాత రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్న రెండో సినిమా ఇది. రవితేజ చేసిన మూడు సినిమా వరుసగా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టాయి. ఇప్పుడు చేస్తున్న సినిమాపైనే ఆశలన్నీ పెట్టుకున్నారు.