రియల్‌ దండుపాళ్యం

రియల్‌ దండుపాళ్యం

  శ్రీ వైష్ణోదేవి మూవీస్‌ పతాకంపై నారాయణ భట్‌ సమర్పించు చిత్రం 'రియల్‌ దండుపాళ్యం'. కన్నడ ఫేమ్స్‌ రాగిణీ ద్విగేది, మేఘన రాజ్‌, దీప్తి, ప్రథమ ప్రసాద్‌, సంయుక్త హొర్నాడ్‌ ముఖ్య పాత్రపోషించారు. సి.పుట్టు స్వామి నిర్మాత. మహేష్‌ దర్శకుడు. ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మహేష్‌ మాట్లాడుతూ 'కన్నడలో ఇదివరకే వచ్చిన దండు పాళ్యానికి, ఈ 'రియల్‌ దండుపాళ్యం' కు చాలా వ్యత్యాసం ఉంది. ఈ రెండు చిత్ర కథలకు ఏమాత్రం సంబంధం లేదు. 1980లో కర్ణాటకలో జరిగిన ఓ యథార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కించాం. 

ఎలా జరిగిందో అలానే సినిమాలో చూపించాం. ఇందులో ఐదుగురు హీరోయిన్స్‌, ఇద్దరు హీరోలు. ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందనే నమ్మకం ఉంద'న్నారు. నిర్మాత పుట్టు స్వామి మాట్లాడుతూ ' ఈ సినిమా పూర్తి అయ్యాక చూస్తే నేనే థ్రిల్‌ అయ్యా. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సినిమాను తెలుగులో కూడా విడుదల చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ఒక అమ్మాయికి అన్యాయం జరిగితే చట్ట పరంగా ఏర్పడిన చర్యను వారు ఎలా ఎదుర్కొన్నారు అనేదే ఈ 'రియల్‌ దండుపాళ్యం' కాన్సెప్ట్‌. తెలుగు, కన్నడ భాషల్లో ఈ నెల ఆఖరున విడుదల చేయడానికి ప్లాన్‌ చేస్తున్నాం' అని తెలిపారు