రోమీ భాటియా పాత్రలో..

రోమీ భాటియా పాత్రలో..

 గత కొంత కాలంగా ప్రేమలో మునిగితేలిన బాలీవుడ్ జంట రణ్‌వీర్‌సింగ్, దీపికాపదుకునే ఈ మధ్య డెస్టినేషన్ వెడ్డింగ్‌తో ఒక్కటైన విషయం తెలిసిందే. ఈ జంట త్వరలో తెరపైన కూడా భార్యాభర్తలుగా కనిపించనున్నారని తెలిసింది. క్రికెట్ లెజెండ్ కపిల్‌దేవ్ జీవితకథని వెండితెరపై దృశ్యమానం చేస్తూ 83 పేరుతో ఓ బయోపిక్ త్వరలో సెట్స్‌పైకి రానున్నది. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించనున్నారు. ఈ చిత్రంలో కపిల్‌దేవ్ పాత్రలో రణ్‌వీర్‌సింగ్ నటించబోతున్నారు. కపిల్ భార్య రోమీ భాటియాగా దీపికా పదుకునే కనిపించనుందని తెలిసింది. ఈ పాత్రకు దీపిక అయితేనే బాగుంటుందని దర్శకుడు కబీర్‌ఖాన్‌తో పాటు చిత్ర బృందం భావిస్తున్నట్లు బాలీవుడ్ చిత్ర వర్గాల సమాచారం. సంజయ్‌లీలా భన్సాలీ రూపొందించిన రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావతి వంటి చిత్రాల్లో రణవీర్, దీపిక కలిసి నటించిన విషయం తెలిసిందే.