ఆర్ఆర్ఆర్‌లో య‌మ‌దొంగ హీరోయిన్..!

ఆర్ఆర్ఆర్‌లో య‌మ‌దొంగ హీరోయిన్..!

 దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న క్రేజీ మ‌ల్టీ స్టార‌ర్ చిత్రం ఆర్ఆర్ఆర్‌(వ‌ర్కింగ్ టైటిల్‌). ఎన్టీఆర్‌, రామ్ చ‌ర‌ణ్ ప్ర‌ధాన పాత్ర‌ల‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు అభిమానుల ఆనందాన్ని పీక్ స్టేజ్‌కి తీసుకెళుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ శివారులో ఏర్పాటు చేసిన భారీ సెట్‌లో చిత్రానికి సంబంధించిన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టు తెలుస్తోంది. మేజిక్ డేట్ 12-12-12న చిత్రానికి సంబంధించిన బిగ్ అనౌన్స్‌మెంట్ ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, ఆ రోజు చిత్ర క‌థానాయిక‌లెవ‌ర‌నే విష‌యంపై క్లారిటీ రానుంద‌ని స‌మాచారం. 

కీర్తి సురేష్‌, ర‌ష్మిక‌ల‌ని క‌థానాయిక‌లుగా ఎంపిక చేశార‌నే టాక్ ప్ర‌స్తుతం వినిపిస్తుండ‌గా, తాజాగా మ‌రో హీరోయిన్ పేరు ప్ర‌ముఖంగా వినిపిస్తుంది. య‌మ‌దొంగ చిత్రంలో ఎన్టీఆర్‌తో జ‌త‌క‌ట్టిన ప్రియ‌మ‌ణిని ముఖ్య పాత్ర కోసం ఎంపిక చేశార‌ని టాక్. . ఇక ఈ చిత్రంలో ‘అర్జున్ రెడ్డి’ తో గుర్తింపు తెచ్చుకున్న యువ కమెడియన్ రాహుల్ రామ కృష్ణ ఒక ముఖ్యమైన పాత్రలో నటించనున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. సుమారు 300కోట్ల భారీ బడ్జెట్ తో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకం ఫై దానయ్య డివివి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు. పిరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈచిత్రం 2020లో ప్రేక్షకులముందుకు రానుంది.