సంక్రాంతి బరిలో వినయ విధేయ రామ

సంక్రాంతి బరిలో వినయ విధేయ రామ

  రామ్‌ చరణ్‌ చేస్తోన్న మాస్‌ మసాలా చిత్రం 'వినయ విధేయ రామ'. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయాలని నిర్ణయించారు. జనవరి 11వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. సంక్రాంతి బరిలో బాలకృష్ణ చేస్తోన్న 'ఎన్టీఆర్‌ కథానాయకుడు' కూడా విడుదల కాబోతుంది. 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ చిత్రంలో మొదటి భాగం ఇది. చెర్రీ సినిమా విడుదలకు రెండు రోజుల ముందు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది బాలకృష్ణ చిత్రం. ప్రస్తుతం ఎన్టీఆర్‌ సినిమాకు ప్రమోషన్‌ పనులు ఓ పక్క చేస్తూనే మరో పక్క చిత్రీకరణ శరవేగంగా జరుపుతున్నారు. రామ్‌ చరణ్‌ చిత్రం షూటింగ్‌ ముగింపు దశలో ఉంది. ఈ సినిమాలో ప్రత్యేక గీతం షూటింగ్‌ కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ సాంగ్‌లో ఇద్దరు అగ్రతారలు డాన్స్‌లు చేయబోతున్నారు. వచ్చే నెల పదో తేదీన హైదరాబాద్‌లో ప్రత్యేకంగా నిర్మించిన సెట్‌లో ఈ గీతాన్ని షూట్‌ చేయనున్నారు.