షారుఖ్‌కు ‘హే రామ్‌’ రీమేక్‌ రైట్స్‌

షారుఖ్‌కు ‘హే రామ్‌’ రీమేక్‌ రైట్స్‌

  కమల్‌ హాసన్‌, రాణి ముఖర్జీ, హేమ మాలిని, అతుల్‌ కులకర్ణి వంటి స్టార్స్‌ కలసి నటించిన చిత్రం 'హే రామ్‌'. ఈ చిత్రంలో షారుఖ్‌ ఖాన్‌ కూడా అతిథి పాత్రలో నటించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని బాలీవుడ్‌లో రీమేక్‌ చేయబోతున్నారు. ఈ రీమేక్‌ రైట్స్‌ను షారుఖ్‌ దక్కించుకున్నారు. ఈ విషయాన్ని కమల్‌ 'ముంబయి మిర్రర్‌'కు చెప్పినట్టు పేర్కొంది. ఇటీవల ముంబయికి హాలీవుడ్‌ దర్శకుడు క్రిస్టోఫర్‌ నోలన్‌ వచ్చినప్పుడు కమల్‌, షారుఖ్‌ అతన్ని కలిశారు. ఆ సమయంలో ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌కు సంబంధించి చర్చలు జరిగాయి. కమల్‌ మాట్లాడుతూ 'షారుక్‌ ఈ సినిమా నటించాడు కానీ పైసా కూడా తీసుకోలేదు. ఏదో ఫ్రెండ్‌గా నటించాడు అంతే. ఇందులో ఆయన పాత్ర చిన్నదే అయినా చాలా ముఖ్యమైనది. ఈ చిత్రం రైట్స్‌ను షారుక్‌ కొన్నారు' అని వెల్లడించారు. ఈ సినిమాను బాలీవుడ్‌లో ఎవరు దర్శకత్వం వహిస్తారు అన్నది మాత్రం చెప్పలేదు. రెడ్‌ చిల్లీస్‌ బ్యానర్‌లో షారుఖ్‌ స్వయంగా నిర్మించనున్నాడు.