షూటింగ్‌కు శ్రీదేవి తనయ

షూటింగ్‌కు శ్రీదేవి తనయ

   శ్రీదేవి అకాలమరణంతో శోకంలో ఉన్న జాన్వి శుక్రవారం నుంచి షూటింగ్‌కు హాజరయ్యారు. సాహిద్‌ కపూర్‌ సోదరుడు ఇషాన్‌ ఖత్తర్‌, జాన్వి హీరో హీరోయిన్లుగా 'ధడక్‌' చిత్రం రూపొందుతోంది. శశాంక్‌ ఖైతాన్‌ దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీదేవి మరణం తర్వాత ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి నిలిచిపోతుందని, జాన్వి చిత్రీకరణకు వచ్చే అవకాశం లేదని వార్తలు ప్రచారమయ్యాయి. జాన్వి మాత్రం శుక్రవారం బంద్రాలో సినిమా సెట్స్‌లో ప్రత్యక్షమై అందరినీ ఆశ్చర్య పరిచారు. ఈ సందర్భంగా షూటింగ్‌లో పాల్గొన్న ఫొటోలో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్‌ చేస్తున్నారు. ఈ ఫొటోలను చూసి అచ్చం శ్రీదేవిలా ఉందని నెటిజన్స్‌ కామెంట్స్‌ పెడుతున్నారు. మరో రెండు రోజులు పాటు బంద్రాలోనే చిత్రీకరణ జరగనుంది. కొత్త షెడ్యూల్‌ కలకత్తాలో ఉండనుంది.