సౌత్‌  సినిమాలో  హీరోయిన్‌ జరీన్‌ ఖాన్‌

సౌత్‌  సినిమాలో  హీరోయిన్‌ జరీన్‌ ఖాన్‌

 సౌత్‌ సినిమాలు కూడా సంచలన విజయాలు సాధిస్తుండటంతో బాలీవుడ్ స్టార్స్‌ సౌత్ సినిమాల మీద దృష్టి పెడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ నటులు తెలుగు, తమిళ సినిమాల్లో ప్రతినాయక పాత్రలో నటించేందుకు ముందుకు వస్తుండగా ఇప్పుడు హీరోయిన్లు కూడా సౌత్ సినిమాల వైపు చూస్తున్నారు. తాజాగా ఈ లిస్ట్‌లో జరీన్‌ ఖాన్‌ కూడా చేరేందుకు రెడీ అవుతోంది.సల్మాన్ ఖాన్‌ హీరోగా తెరకెక్కిన వీర్‌ సినిమాతో వెండితెరకు పరిచయం అయిన జరీన్‌ ఖాన్‌, అనుకున్న స్థాయిలో సక్సెస్‌ సాధించలేకపోయింది. హేట్ స్టోరి 3 లాంటి సినిమాలో గ్లామర్‌ రోల్‌లో కనిపించినా కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. దీంతో సక్సెస్‌ కోసం సౌత్ సినిమాల మీద దృష్టి పెట్టింది ఈ బ్యూటి. ప్రస్తుతం గోపిచంద్ హీరోగా తమిళ దర్శకుడు తిరు తెరకెక్కిస్తున్న  సినిమాలో జరీన్‌ ఖాన్‌ హీరోయిన్‌గా నటించనుందన్న టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాలో రాశీఖన్నాను ఒక హీరోయిన్‌గా ఫైనల్‌ గా చేయగా మరో హీరోయిన్‌ పాత్రకు జరీన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారు చిత్రయూనిట్‌.