శ్రీలక్ష్మి...24 ముద్దులు

శ్రీలక్ష్మి...24 ముద్దులు

 నా పేరు కుమారి, వయసు 21.... అంటూ కుమారి 21ఎఫ్ సినిమాలో చలాకీ నటనతో యువతరం మనసుల్ని దోచేసింది హెభాపటేల్. ఈ సినిమాతో తెలుగు చిత్రసీమలో లక్కీస్టార్‌గా గుర్తింపును సొంతం చేసుకున్న ఆమెను పలు అవకాశాలు వరించాయి. కథల ఎంపికలో పొరపాట్లు, పరాజయాల కారణంగా వచ్చిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది. గత ఏడాది ఆమె నటించిన సినిమాలేవి సరైన ఫలితాన్ని అందుకోలేదు. పూర్వ వైభవం కోసం తపిస్తున్న ఆమె తాజాగా వినూత్న ప్రయోగంతో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమైంది. మిణుగురులు సినిమాతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు c తాజాగా శ్రీలక్ష్మీ అండ్ 24 కిసెస్ పేరుతో ఓ సినిమాను తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హెభాపటేల్ ఈ సినిమాలో కథానాయికగా నటించనున్నది. నవతరం ప్రేమకథతో రూపొందనున్న ఈ సినిమాలో హెభాపటేల్ బోల్డ్ క్యారెక్టర్‌లో కనిపించబోతున్నట్లు తెలిసింది. కుమారి 21ఎఫ్ తరహాలోనే గ్లామర్‌తో పాటు అభినయానికి ప్రాముఖ్యత కలిగిన పాత్ర ఇదని తెలిసింది. ఇంద్రతో పాటు పలు సినిమాల్లో బాలనటుడిగా కనిపించిన తేజ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నట్లు సమాచారం.