తరుణ్‌భాస్కర్ కొత్త మూవీ టైటిల్ ఇదేనా..?

తరుణ్‌భాస్కర్ కొత్త మూవీ టైటిల్ ఇదేనా..?

 హైదరాబాద్ : పెళ్లి చూపులు సినిమాతో సూపర్‌హిట్ సక్సెస్‌ను అందుకున్నాడు డైరెక్టర్ తరుణ్‌భాస్కర్. తొలి సినిమాతోనే వసూళ్ల సునామిని సృష్టించాడు. రెండో సినిమాను సురేశ్ ప్రొడక్షన్స్‌లో తీయనున్నట్లు ప్రకటించినా..ఆ ప్రాజెక్టుపై క్లారిటీ ఇవ్వలేదు. అయితే తాజాగా తరుణ్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్నది. సెకండ్ మూవీకి ‘ఈ నగరానికి ఏమైంది’ అయితే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమా ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుంది. నటీనటులెవరనే వివరాలను తరుణ్ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.